సీఎంఆర్‌ఎఫ్‌తో కార్పొరేట్ వైద్యం
ABN , First Publish Date - 2023-03-19T23:41:42+05:30 IST
సీఎంఆర్‌ఎఫ్ ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని బీఆర్‌ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఆయన పేర్కొన్నారు.

తలకొండపల్లి, మార్చి19: సీఎంఆర్‌ఎఫ్ ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని బీఆర్‌ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. తలకొండపల్లి మండలం నల్లరాళ్ల తండాకు చెందిన అరుణ్‌కు ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.32 వేలు మంజూరయ్యాయి. ఈమేరకు ఆదివారం తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామంలో బాధిత కుటుంబానికి శ్రీనివాస్‌యాదవ్ చెక్కును అందజేశారు. పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య సేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ముజుబుర్ రహెమాన్, నాయకులు శేఖర్ యాదవ్, జంగయ్య గౌడ్, శ్యామ్‌సుందర్‌రెడ్డి, వెంకటేశ్, గణేశ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.