కులకచర్ల మండలంలో ఆరుగురికి కరోనా

ABN , First Publish Date - 2023-03-25T22:58:08+05:30 IST

వికారాబాద్‌ జిల్లా, కులకచర్ల మండల పరిధిలో శనివారం కొత్తగా 6 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చాలామంది జ్వరాలతో ఆసుపత్రికి వచ్చారు.

 కులకచర్ల మండలంలో ఆరుగురికి కరోనా

కులకచర్ల, మార్చి 25: వికారాబాద్‌ జిల్లా, కులకచర్ల మండల పరిధిలో శనివారం కొత్తగా 6 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చాలామంది జ్వరాలతో ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు 126 మందికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించారు. అందులో కులకచర్లకు చెందిన ముగ్గురికి, ఇప్పాయిపల్లికి చెందిన ఇద్దరికి, పీరంపల్లిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి మాధురి తెలిపారు. ఆదివారం నుంచి ప్రతి రోజూ ఆసుపత్రిలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌వో చంద్రప్రకాశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T22:58:08+05:30 IST