కానిస్టేబుల్ అప్రమత్తత.. వృద్ధుడి ప్రాణాలు సేఫ్
ABN , First Publish Date - 2023-03-19T00:14:41+05:30 IST
వృద్ధుడిని, టీవీఎస్ వాహనాన్ని పక్కకు తీస్తున్న కానిస్టేబుల్, తదితరులు

షాద్‌నగర్ రూరల్, మార్చి 18 : విధి నిర్వహణలో భాగంగా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన అప్రమత్తతతో వృద్ధుడి ప్రాణాలు కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. ఫరూఖ్‌నగర్ మండలం రాసుమల్లగూడ గ్రామానికి చెందిన సాయన్న శనివారం తన టీవీఎస్ వాహనంపై హైదరాబాద్ వైపు నుంచి షాద్‌నగర్ చౌరస్తాకు చేరుకున్నాడు. పరిగి రోడ్డు వైపు వాహనాన్ని మలుపుతుండగా రోడ్డుపై పడిపోయాడు. ఈక్రమంలో జడ్చర్ల వైపు వెళ్తున్న లారీ వేగంగా వస్తోంది. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్.. పరుగెత్తుకుంటూ వెళ్లి డ్రైవర్‌ను లారీ ఆపాల్సిందిగా సిగ్నలిచ్చాడు. అయితే, అప్పటికే రోడ్డుపై పడిపోయిన సాయన్న కాలుపై లారీ ముందు టైరు ఎక్కడంతో గాయమైంది. దీంతో కానిస్టేబుల్ స్థానికుల సాయంతో సాయన్నను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివా్‌సను ఈసందర్భంగా పలువురు అభినందించారు.