90 రోజుల్లో అధికారంలోకి కాంగ్రెస్
ABN , First Publish Date - 2023-09-22T00:08:24+05:30 IST
రాష్ట్రంలో మరో 90 రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరుతుందని, అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ నాయకుడు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.
ఆమనగల్లు, సెప్టెంబరు 21 : రాష్ట్రంలో మరో 90 రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరుతుందని, అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ నాయకుడు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. తుక్కుగూడ విజయభేరి సభకు వచ్చిన జనాన్ని చూసి బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆమనగల్లు మున్సిపాలిటీ నుచ్చుగుట్ట తండా, సాకిబండతండా, తలకొండపల్లి మండలం వెంకటాపూర్, దేవునిపడకల్, పడకల్, చీనపునుంతల, గడ్డమీది తండా, వెంకటాపూర్ తండా లకు చెందిన పలువురు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు గురువారం తలకొండపల్లి మండల కాంగ్రెస్ మాజీ అద్యక్షుడు గుజ్జల మహేశ్ ఆధ్వర్యంలో రాఘవేందర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్, కాంగ్రెస్ తలకొండపల్లి మండల మాజీ అధ్యక్షుడు మహేశ్, నాయకులు వెంకటయ్య, శ్రీశైలంగౌడ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.