విజయభేరి సభకు తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు

ABN , First Publish Date - 2023-09-17T23:38:46+05:30 IST

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి బహిరంగ సభకు వికారాబాద్‌ నియోకవర్గం నుంచి నాయకులు పెద్దఎత్తున తరలి వెళ్లారు.

విజయభేరి సభకు తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు
విజయభేరి సభకు బషీరాబాద్‌ మండలం నుంచి తరలివెలుతున్న కాంగ్రెస్‌ నాయకులు

వికారాబాద్‌, సెప్టెంబరు 17: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి బహిరంగ సభకు వికారాబాద్‌ నియోకవర్గం నుంచి నాయకులు పెద్దఎత్తున తరలి వెళ్లారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ నివాసం నుంచి ఆదివారం నాయకులు అర్ధ సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో తరలివెళ్లారు.

పరిగి: తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్‌ విజయభేరి సభకు పరిగి నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.లాల్‌కృష్ణప్రసాద్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో భారీగా తరలివెళ్లారు. పరిగిలోని రామ్మోహన్‌రెడ్డి నివాసం నుంచి ఇందిరాగాంఽధీ విగ్రహం వరకు భారీ నిర్వహించారు. అంబేద్కర్‌, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కులకచర్ల/పూడూరు: తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ విజయభేరి మహాసభకు మండలంలోని కాంగ్రెస్‌ శ్రేణులు ఆదివారం భారీగా తరలివెళ్లారు. డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బీఎస్‌ ఆంజనేయులు ఆధ్వర్యంలో కులకచర్ల చౌరస్తా నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు వాహనాల్లో తరలివెళ్లారు. వాహనాలకు జెండా ఊపి వారు ప్రారంభించారు. అదేవిధంగా పూడూరులోని వివిధ గ్రామాల కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి వెళ్లారు.

మోమిన్‌పేట్‌: విజయభేరి బహిరంగ సభకు కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మన్నె శంకర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ వికారాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సుభా్‌షగౌడ్‌, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిరాజుద్దీన్‌, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

బషీరాబాద్‌: తుక్కుగూడలో ఆదివారం జరిగిన విజయభేరి సభకు బషీరాబాద్‌ మండలం నుంచి ఆపార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. మండల అధ్యక్షుడు కలాల్‌ నర్సింహులు గౌడ్‌, సీనియర్‌ నాయకులు లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో ర్యాలీగా తరలివెళ్లారు. నియోజకవర్గ సీనియర్‌ నాయకులు ఉత్తంచంద్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పెద్దేముల్‌: మండలంలోని వివిధ గ్రామాల నుంచి తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రె్‌సపార్టీ విజయభేరి సభకు పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌ ఆధ్వర్యంలో ఆపార్టీ కార్యకర్తలు భారీసంఖ్యలో తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌కుమార్‌, న్యాయవాది ఎల్లారెడ్డి ఉన్నారు.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో..

మేడ్చల్‌ టౌన్‌: తుక్కుగూడలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు మేడ్చల్‌ నుంచి కాంగ్రెస్‌ నాయకులు పెద్దఎత్తున తరలి వెళ్లారు. టీపీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సర్పంచుల ఫోరం అధికార ప్రతినిధి సురేందర్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు.

కీసర రూరల్‌: కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరిసభకు నాగారం మున్సిపాలిటీ నుండి భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్‌ కౌన్సిలర్‌ పంగ హరిబాబు, మాజీ సర్పంచ్‌ గూడూరు అశోక్‌గౌడ్‌, చక్రపాణిగౌడ్‌ పాల్గొన్నారు.

శామీర్‌పేట: తుక్కుగూడలో ఆదివారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ విజయబేరికి శామీర్‌పేట మండలం, తూంకుంట మున్సిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ గౌడ్‌, జైపాల్‌రెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు.

Updated Date - 2023-09-17T23:38:46+05:30 IST