కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
ABN , First Publish Date - 2023-12-03T23:47:42+05:30 IST
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి గెలుపుతో ఆదివారం యాచారం, మంచాల మండలాల పరిధిలోని గ్రామాల్లో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, ర్యాలీలతో హోరెత్తించారు. 40 ఏళ్ల తర్వాత నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడంపై పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు.
మల్‌రెడ్డి రంగారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్ గెలుపుతో ఆనందం
టపాసులు పేల్చి స్వీట్లు పంచిన నాయకులు, కార్యకర్తలు
విజయోత్సవ ర్యాలీలు
మంచాల/యాచారం, డిసెంబరు 3 : ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి గెలుపుతో ఆదివారం యాచారం, మంచాల మండలాల పరిధిలోని గ్రామాల్లో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, ర్యాలీలతో హోరెత్తించారు. 40 ఏళ్ల తర్వాత నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడంపై పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఆరుట్లలో జరిగిన సంబరాల్లో సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, నాయినంపల్లి యాదయ్య, సలాం, గుడ్డిమల్ల చంద్రయ్య, జాపాలలో ఆవుల మల్లేష్, సీహెచ్ సంజీవ, రమే్‌షసార్, ఓరుగంటి లింగం, లోయపల్లిలో మిద్దె శ్రీనివా్‌సగౌడ్, మోతీరాంనాయక్, శ్రీనివా్‌సనాయక్, గణేష్, ఎల్లమ్మతండాలో మల్లేష్, శ్రీధర్‌నాయక్, చెన్నారెడ్డిగూడలో వెంకటే్‌షయాదవ్, జంగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. యాచారం మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. మాల్‌లో శ్రీపబ్బతి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మంతన్‌గౌరెల్లి, గున్‌గల్, గడ్డమల్లాయాగూడ, కుర్మిద్ద, చౌదర్‌పల్లి తదితర గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు ఎండీ గౌస్, వి.తిరుమలేష్, అరవింద్‌నాయక్, శ్రీనివా్‌సరెడ్డి, మల్లేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌లో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ
షాద్‌నగర్/షాద్‌నగర్‌అర్బన్/కొత్తూర్/కేశంపేట/చౌదరి గూడ/కొందుర్గు: షాద్‌నగర్ ఎమ్మెల్యేగా వీర్లపల్లి శంకర్ విజయం సాధించడంతో ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డితో కలిసి వీర్లపల్లి ర్యాలీని కొనసాగించారు. షాద్‌నగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి హైదరాబాద్ రోడ్, కాలేజీ రోడ్డు, మెయిన్‌రోడ్డు మీదుగా ఊరేగింపును కొనసాగించారు. కార్యకర్తలు, అభిమానులు డీజే మ్యూజిక్‌తో నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. పెద్దఎత్తున బాణసంచా కాలుస్తూ కేరింతలు కొట్టారు. వీర్లపల్లి గెలుపొందగానే షాద్‌నగర్ చౌరస్తాకు చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. వీర్లపల్లి శంకర్ సతీమణి అనురాధ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీలో పాల్గొన్నారు. జడ్పీటీసీలు వెంకట్‌రాంరెడ్డి, విశాలశ్రవణ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్ తదితరులున్నారు. కేశంపేట మండల కేంద్రంతో పాటు చౌలపల్లి, ఎక్లా్‌సఖాన్‌పేట, సంగెం, వేమల్‌నర్వ, కొండారెడ్డిపల్లి, పాపిరెడ్డిగూడ, ఇప్పలపల్లి, కొత్తపేట, కాకునూర్, తొమ్మిదిరేకుల, లింగంధన, నిర్థవెల్లి గ్రామాలలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మండలాధ్యక్షుడు వీరేశ్, లంకాల సురే్‌షరెడ్డి, జగదీశ్వర్ప, యెన్నం శ్రీధర్‌రెడ్డి, పల్లె ఆనంద్‌కుమార్, తదితరులున్నారు. కొందుర్గు మండల కేంద్రంలో మిఠాయిలు పంచిపెచ్టి బాణసంచా కాల్చి ర్యాలీ నిర్వహించారు. యాదయ్య, సి.కృష్ణయ్య, బోరిగే నరేందర్, బి.రవి, కావలి లక్ష్మయ్య, హరిశంకర్, రవికుమార్, పెంటయ్య, కె.రాములుగౌడ్, ఇ.రఘునాథ్‌గౌడ్, ఎం.అమృతయ్య, కావలి దశరథం, మాణయ్య, కె.కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు. చౌదరిగూడ మండల కేంద్రంలో పాటు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ముఖ్య కూడళ్లలో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. చంద్రబాబుగౌడ్, అజ్జు, అయూబ్, బాలయ్య, దామోదర్, చందు నాయక్, శివకుమార్, జంగయ్య, అంజి, నర్సింలు, భాను తదితరులు పాల్గొన్నారు. వీర్లపల్లి గెలుపుతో ఫరూఖ్‌నగర్ మండలంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలు టపాసులు పేల్చి బైక్ ర్యాలీలు నిర్వహించారు. కొత్తూర్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. వీర్లపల్లి శంకర్ గెలుపొందిన ఆనంతరం షాద్‌నగర్ వస్తుండగా, కొత్తూర్ మండల కేంద్రంలో శ్రేణులు ఘనస్వాగతం పలికి, ఘనంగా సన్మానించారు. కాగా, షాద్‌నగర్ నుంచి గెలుపొందడం ప్రజా విజయమని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న ఆలోచనతో తీర్పునిచ్చిన ప్రజలకే ఈ విజయాన్ని అంకితం చేస్తానని వీర్లపల్లి శంకర్ తెలిపారు. గండిపేటలోని లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన వీర్లపల్లి విలేకరులతో మాట్లాడారు. రజక జాతిని గుర్తించి, తనను అసెంబ్లీకి పంపిన రేవంత్‌రెడ్డికి విధేయుడిగా ఉంటానని, గెలిపించిన ప్రజలకు అండగా నిలిచి, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానన్నారు. అన్నివర్గాల వారు ముందుకు వచ్చి తనను గెలిపించారని, వారందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. ముఖ్యంగా పార్టీలో చేరి, తనకు, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చి, విజయాన్ని అందించిన నాయకులకు వీర్లపల్లి శంకర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, పదేళ్ల దుష్టపాలనకు చరమగీతం పాడిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇకపై మంచి పాలన అందిస్తుందని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి తెలిపారు. షాద్‌నగర్‌లోని పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రతా్‌పరెడ్డి మాట్లాడారు. వీర్లపల్లి శంకర్‌ను గెలిపించిన క్యాడర్‌కు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మా మిడి శ్యాంసుందర్‌రెడ్డి, శివశంకర్‌గౌడ్, కాశీనాథ్‌రెడ్డి, దంగు శ్రీనివా్‌సయాదవ్, కొవ్వూరి పురుషోత్తంరెడ్డి, చెన్నయ్య, రాజునాయక్ తదితరులున్నారు.
కసిరెడ్డి విజయం పట్ల కార్యకర్తల ఆనందం
ఆమనగల్లు : కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి విజయం సాధించడం పట్ల ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం సాయంత్రం సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ గెలుపొందినట్లు ప్రకటించగానే ఆ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆనందంతో పార్టీ జెండాలు చేబూని కాంగ్రెస్, సోనియా, రాహుల్, రేవంత్, వంశీ, కసిరెడ్డిలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. బాణా సంచా పేల్చి, రంగులు చల్లుకొని ఆనందంతో నృత్యాలు చేశారు. పలువురు నాయకులు కసిరెడ్డి నారాయణ రెడ్డి వద్దకు వెళ్లి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమనగల్లు పట్టణంలో కసిరెడ్డి సతీమణి మాధవిరెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు అయిళ్ల శ్రీనివా్‌సగౌడ్, కమ్లీమోత్యనాయక్, అనితవిజయ్, గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బీచ్యనాయక్, శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, యాట నర్సింహ్మ, కల్లు రమణారెడ్డి, జగన్, మండ్లీ రాములు, హన్మనాయక్, డోకూరు ప్రభాకర్ రెడ్డి, గుజ్జల మహేశ్, మిట్టపల్లి అంజయ్య, మోహన్‌రెడ్డి, భగవాన్ రెడ్డి, వస్పుల జంగయ్య, వేణుగోపాల్, కేశవులు, వస్పుల మానయ్య, వగ్గు మహేశ్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.