కాంగ్రెస్‌ నేతలవి మతిమితం లేని మాటలు

ABN , First Publish Date - 2023-03-30T00:29:30+05:30 IST

కాంగ్రెస్‌ నాయకులు న్యాయ వ్యవస్థను, రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని బీజేపీ షాద్‌నగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్‌ నేతలవి మతిమితం లేని మాటలు
నాయకులతో కలిసి మాట్లాడుతున్న శ్రీవర్ధన్‌రెడ్డి

షాద్‌నగర్‌ అర్బన్‌, మార్చి 29: కాంగ్రెస్‌ నాయకులు న్యాయ వ్యవస్థను, రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని బీజేపీ షాద్‌నగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి విమర్శించారు. స్థానిక మల్లిఖార్జున కాలనీలో బుధవారం శక్తి కేంద్రం ఇచ్‌చార్జి ప్యాట అశోక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ స్వశక్తికరణ సమావేశానికి శ్రీవర్ధన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుతో బీజేపీకి గానీ, ప్రధాని మోదీకి గానీ ఎలాంటి సంబంధం లేకున్నా.. కాంగ్రెస్‌ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. రాహుల్‌ గాంధీకి కోర్టు ఇచ్చిన తీర్పుకనుగుణంగా ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 ప్రకారం అనర్హత వేటు పడిందే తప్ప, ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదన్న విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు తెలుసుకోవాలని కోరారు. దేశానికి ఆదర్శ పాలనను అందిస్తూ.. ప్రపంచ గుర్తింపు పొందిన ప్రధాని మోదీని విమర్శిస్తే సహించబోమని హెచ్చరించారు. డాక్టర్‌ విజయ్‌కుమార్‌, వంశీకృష్ణ, ప్యాట అశోక్‌, మురళి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T00:29:30+05:30 IST