Share News

డిగ్రీ ప్రశ్నాపత్రంలో గందరగోళం

ABN , Publish Date - Dec 14 , 2023 | 11:13 PM

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్‌ ఆంగ్ల ప్రశ్నాపత్రంలో గందరగోళం నెలకొంది. ఈ నెల 12 నుంచి పాలమూరు యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలకు షాద్‌నగర్‌ పట్టణంలో ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

డిగ్రీ ప్రశ్నాపత్రంలో గందరగోళం

పాత సిలబస్‌తో కూడిన ఆంగ్ల ప్రశ్నాపత్రం ఇవ్వడంతో విద్యార్థుల అవాక్కు

ఎట్టకేలకు కొత్త సిలబస్‌ ప్రశ్నాపత్రం.. 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష

షాద్‌నగర్‌, డిసెంబరు 14 : పాలమూరు యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్‌ ఆంగ్ల ప్రశ్నాపత్రంలో గందరగోళం నెలకొంది. ఈ నెల 12 నుంచి పాలమూరు యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలకు షాద్‌నగర్‌ పట్టణంలో ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం డిగ్రీ చివరి సంవత్సరం ఆంగ్లం పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈమేరకు పరీక్షా సమయానికి విద్యార్థులు పేపర్‌ ఓపెన్‌ చేసి చూడగా.. గతంలో ఉన్న పాల సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని చూసి అవాక్కయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన అధ్యాపకులు వెంటనే యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో వారు పరీక్ష పత్రాన్ని విద్యార్థులకు ఇవ్వకూడదని ఆదేశించారు. అనంతరం అధికారులు ఉదయం 10.15 గంటలకు కొత్త సిలబస్‌తో కూడిన ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు పంపించారు. దీంతో ఉదయం 9.30 గంటలకు నిర్వహించాల్సిన పరీక్షను 45 నిమిషాలు ఆలస్యంగా నిర్వహించడంతో విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా పాత ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్షను రద్దు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయని పలువురు అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Dec 14 , 2023 | 11:13 PM