రాజీయే రాజ మార్గం
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:09 PM
రాజీయే రాజమార్గం అని ఆమనగల్లు జూనియర్ సివిల్ జడ్జి కాటం స్వరూప అన్నారు. ఈ నెల 30న జరిగే లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకొని రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.
ఆమనగల్లు, డిసెంబరు 17: రాజీయే రాజమార్గం అని ఆమనగల్లు జూనియర్ సివిల్ జడ్జి కాటం స్వరూప అన్నారు. ఈ నెల 30న జరిగే లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకొని రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు. ఆదివారం ఆమనగల్లు కోర్టు హాల్‌లో లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జడ్జి స్వరూప మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్‌పై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాల పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది, సీఐలు వెంకటేశ్వర్లు, శివప్రసాద్, ఎస్‌ఐలు బాల్‌రామ్‌నాయక్, హరిశంకర్‌గౌడ్, శ్రీను, రఫీ, ఎక్సైజ్ ఎస్‌ఐలు యాదయ్య, స్వప్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.