సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
ABN , First Publish Date - 2023-03-05T00:13:24+05:30 IST
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని పిల్లోనిగూడ గ్రామానికి చెందిన పెరికి వెంకటే్‌ష కు రూ.18 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేశారు.
శంషాబాద్ రూరల్ మార్చి 4 : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని పిల్లోనిగూడ గ్రామానికి చెందిన పెరికి వెంకటే్‌ష కు రూ.18 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేశారు. ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎంతో మంది పేదలు కార్పొరేట్ వైద్యం చేసుకుంటున్నారని చెప్పారు. గతంలో సీఎంఆర్‌ఎఫ్ మంజూరు కావాలంటే సంవత్సరాలు పట్టేదని, ఇప్పుడు రెండు, మూడు నెలల్లోనే మంజూరవుతుందన్నారు. ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, సర్పంచ్ బుచ్చమ్మ, పీఎ్‌ససీఎస్ చైర్మన్ దౌనకర్‌గౌడ్, బీఆర్‌ఎస్ మండల యుత్ అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు జూర్కి రమేష్ పటేల్, కృష్ణ, నర్సింహ, శ్రీకాంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.