మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించాలి

ABN , First Publish Date - 2023-09-17T23:36:43+05:30 IST

మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించాలని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. జడ్పీటీసీ మలిపెద్ది మేఘమాల ప్రభాకర్‌గుప్త ఆధ్వర్యంలో ఆదివారం పరిగిలోని ఆమె స్వగృహంలో ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు.

మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించాలి
పరిగి: జడ్పీటీసీ మేఘమాల ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

పరిగి, సెప్టెంబరు 17: మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించాలని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. జడ్పీటీసీ మలిపెద్ది మేఘమాల ప్రభాకర్‌గుప్త ఆధ్వర్యంలో ఆదివారం పరిగిలోని ఆమె స్వగృహంలో ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి, పూడూరు జడ్పీటీసీలు బి.హరిప్రియ, మున్సిపల్‌ చైర్మన్‌ ఎం.ఆశోక్‌, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌, పరిగి, ఎంపీపీలు అరవింద్‌రావు, మల్లేశం, మాజీ అధ్యక్షుడు బి.ప్రవీణ్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌, కావలి లక్ష్మి, వీరమణి పాల్గొన్నారు.

మోమిన్‌పేట్‌: మతసామరాస్యానికి ప్రతీక మట్టి వినాయక చవితి అని మండల రైతు బంధు కో ఆర్డినేటర్‌ అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు. మండల కేంద్రంలోని సంగమేశ్వర ఆలయంలో ఆదివారం హిందూ బంధువులకు ఆయన మట్టి వినాయకులను పంపిణీ చేశారు.

ఘట్‌కేసర్‌ రూరల్‌: మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని అనురాగ్‌ యూనివర్సిటీ ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రోగ్రాం అఫీసర్‌ మల్లేష్‌ తెలిపారు. మండలంలోని వెంకటాపూర్‌ అనురాగ్‌ యూనివర్సిటీలో ఆదివారం ఎన్‌ఎ్‌సఎ్‌స కార్యక్రమంలో భాగంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఎ్‌స వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

కొడంగల్‌: కొడంగల్‌లోని ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర ఆదివారం శ్రీ అయ్యప్పస్వామి నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా మట్టి వినాయకులను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రవీందర్‌యాదవ్‌, బుక్క విక్రం పాల్గొన్నారు.

కీసర రూరల్‌: పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలకు పూజించటం శ్రేయస్కరమని నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు.నాగారం మున్సిపాలిటీ పరిధి ఆరు, ఎనిమిది వార్డుల్లో ఆదివారం మట్టి వినాయక ప్రతిమలను కీసర పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్యతో కలిసి ప్రజలకు పంపిణీ చేశారు.

Updated Date - 2023-09-17T23:36:43+05:30 IST