శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క్రిస్మస్ వేడుకలు షురూ
ABN , Publish Date - Dec 22 , 2023 | 11:41 PM
మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈసందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు రోజుల ముందే క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు.
శంషాబాద్ రూరల్/షాద్‌నగర్, డిసెంబరు 22 : మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈసందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు రోజుల ముందే క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు. జీఎంఆర్ అధికారులు ఎయిర్‌పోర్టు అరైవల్‌లో శాంతాక్లాజ్‌ను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. అదేవిధంగా విమానాశ్రయంలోని ఎయిర్‌పోర్టు విలేజ్‌లో ప్రయాణికులను ఆకర్శించే విధంగా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. రోటర్ 1 నుంచి రోటర్ 5 వరకు దారి పొడవునా రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. అదేవిధంగా వైద్య, ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం షాద్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రీక్రిస్‌మస్ వేడుకలను నిర్వహించారు. షాద్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జయలక్ష్మి కేక్ కట్ చేశారు. ఆమె మాట్లాడుతూ క్రీస్తు జననం, ఆయన ప్రజలకు చేసిన సేవల గురించి వివరించారు. డాక్టర్ అమృత జోసఫ్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, ఆప్తాలమిక్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ జె.శ్రీహరి, చిట్టిబాబు, సీహెచ్‌వో ఉదయ్‌కుమార్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.