చెన్నకేశవరెడ్డి గెలుపునకు కృషి చేయాలి
ABN , First Publish Date - 2023-03-05T00:13:19+05:30 IST
పీఆర్టీయూ బలపరుస్తున్న టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి గెలుపునకు టీచర్లు మొదటి ప్రాధాన్య ఓటు వే యాలని పీఆర్టీయూ మండల అధ్యక్షుడు ఆర్.కేశవులు అభ్యర్థించారు.
దోమ, మార్చి 4: పీఆర్టీయూ బలపరుస్తున్న టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి గెలుపునకు టీచర్లు మొదటి ప్రాధాన్య ఓటు వే యాలని పీఆర్టీయూ మండల అధ్యక్షుడు ఆర్.కేశవులు అభ్యర్థించారు. శనివారం దిర్సంపల్లి, మోత్కూర్, బడెంపల్లి పాఠశాలల్లో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య, వెంకట్‌చారి, ప్రవీణ్‌సింగ్, జైరాం, చక్రవర్తి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.