Share News

బురంతపల్లిలో చిరుత అనవాళ్లు!

ABN , First Publish Date - 2023-11-10T23:59:25+05:30 IST

వికారాబాద్‌ పరిధిలో చిరుతు ఆనవాళ్లతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పరిసర గ్రామాల్లో కొన్ని రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరిస్తున్నారు.

బురంతపల్లిలో చిరుత అనవాళ్లు!

భయాందోళనలో ప్రజలు

వికారాబాద్‌, నవంబరు 10 : వికారాబాద్‌ పరిధిలో చిరుతు ఆనవాళ్లతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పరిసర గ్రామాల్లో కొన్ని రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గోధుమగూడ గ్రామంలో చిరుత మేకను లాక్కేళ్లి తిన్న ఆనవాళ్లు శుక్రవారం గ్రామస్తులు పసిగట్టారు. అదే రోజు ఉదయం బురంతపల్లి గ్రామ శివారుల్లోని వ్యవసాయ పొలాల్లో చిరుతపులి సంచరించినట్లు గ్రామస్తుడు అధికారులకు సమాచారం అందించారు. చిరుత తిరిగిన ప్రాంతానికి వచ్చిన అటవీ అధికారులు పాదాల అడుగులు పరిశీలించగా అవి పులి పాదాలేనని ధృవీకరించారు. ఒకే చిరుత సంచరిస్తుందా.. లేక రెండుమూడు పులులు సంచరిస్తున్నాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. సంబంధిత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - 2023-11-10T23:59:26+05:30 IST