తెలంగాణ సరిహద్దులో చెక్‌పోస్టు

ABN , First Publish Date - 2023-04-21T22:56:13+05:30 IST

రాష్ట్రంలో రైతులకు వరి ధాన్యానికి మద్దతు ధర అందిస్తూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ధాన్యాన్ని తరలించకుండా ముందస్తుగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టింది.

తెలంగాణ సరిహద్దులో చెక్‌పోస్టు
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని చెక్‌ పోస్టు వద్ద వాహనాల తనిఖీ

తాండూరు రూరల్‌, ఏప్రిల్‌ 21 : రాష్ట్రంలో రైతులకు వరి ధాన్యానికి మద్దతు ధర అందిస్తూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ధాన్యాన్ని తరలించకుండా ముందస్తుగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టింది. శుక్రవారం తాండూరు మండల పరిధిలోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కొత్లాపూర్‌ వద్ద ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసిన అధికారులు కర్ణాటక నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి తెలంగాణలోకి వదులుతున్నారు. అయితే కర్ణాటక రైతులకు అక్కడి ప్రభుత్వం వరి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకపోవడంతో ఆ ప్రాంత రైతులు సరిహద్దు గ్రామాల నుంచి వరిధాన్యాన్ని మార్కెట్‌కు తరలించకుండా కట్టడి చేస్తున్నారు. ఈ చెక్‌ పోస్టు వద్ద రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. అందుకోసం సరిహద్దులో ఇద్దరు వీఆర్‌ఏలు, ముగ్గురు పోలీసులతో 24గంటలపాటు మూడు షిఫ్ట్‌లుగా తనిఖీలు చేపడుతున్నారు.

Updated Date - 2023-04-21T22:56:13+05:30 IST