అంతర్జాతీయ చిత్రకళా పోటీల్లో చంద్రశేఖర్‌కు ప్రథమ బహుమతి

ABN , First Publish Date - 2023-01-25T00:22:46+05:30 IST

అంతర్జాతీయ చిత్రకళాపోటీల్లో ఆమనగల్లు మండలం చింతలపల్లికి చెందిన కొప్పు చంద్రశేఖర్‌ అద్భుత కళానైపుణ్యాన్ని చాటాడు. అంతర్జాతీయ చిత్రకళాపోటీల్లో చంద్రశేఖర్‌ వేసిన కలిసి బతకడం అనే పెయింటింగ్‌ ఫొటో అందరినీ అమితంగా ఆలోచింపజేసింది.

అంతర్జాతీయ చిత్రకళా పోటీల్లో చంద్రశేఖర్‌కు ప్రథమ బహుమతి
బహుమతి అందుకుంటున్న చంద్రశేఖర్‌,

ఆమనగల్లు, జనవరి24: అంతర్జాతీయ చిత్రకళాపోటీల్లో ఆమనగల్లు మండలం చింతలపల్లికి చెందిన కొప్పు చంద్రశేఖర్‌ అద్భుత కళానైపుణ్యాన్ని చాటాడు. అంతర్జాతీయ చిత్రకళాపోటీల్లో చంద్రశేఖర్‌ వేసిన కలిసి బతకడం అనే పెయింటింగ్‌ ఫొటో అందరినీ అమితంగా ఆలోచింపజేసింది. ఏపీలోని అమలాపురంలో కోనసీమ చిత్రకళాపరిషత్‌ ఆధ్వర్యంలో సోమవారం 32వ అంతర్జాతీయ చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి 780 మంది చిత్రకళాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఆమనగల్లు మండలం చింతలపల్లికి చెందిన కళాకారుడు కొప్పు చంద్రశేఖర్‌ వేసిన ‘లివింగ్‌ టుగెదర్‌’ పెయింటింగ్‌కు ప్రథమ బహుమతి లభించింది. బహుమతిగా చంద్రశేఖర్‌కు కోనసీమ చిత్ర కళాపరిషత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరసాల సీతారామస్వామి భారత చిత్రకళా రత్న గొల్డెన్‌ మయూరి అవార్డుతో పాటు రూ.10వేల నగదును అందజేశారు. ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప, దృశ్య కళల అకాడమి చైర్మన్‌ శైలజ, అంతర్జాతీయ, జాతీయ కళాకారులు, శిల్పులు. జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కళాకారులు అభినందించారు.

Updated Date - 2023-01-25T00:22:47+05:30 IST