‘రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్టు’
ABN , First Publish Date - 2023-09-17T23:42:18+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును అరెస్టు చేయడం రాజకీయ కక్షేనని టీటీడీపీ ఉపాధ్యక్షుడు టీజేకీ మూర్తి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి సుంకరి వెంకటేశ్ అన్నారు.

కీసర రూరల్, సెప్టెంబరు 17: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును అరెస్టు చేయడం రాజకీయ కక్షేనని టీటీడీపీ ఉపాధ్యక్షుడు టీజేకీ మూర్తి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి సుంకరి వెంకటేశ్ అన్నారు. నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా ఆదివారం దమ్మాయిగూడలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా దమ్మాయిగూడ చౌరస్తా నుండి దుబాయ్ బిల్డింగ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల అధ్యక్షులు కొండా జంగారెడ్డి, ఎన్.కృష్ణారావు, జనరల్ సెక్రటరీ కోటేశ్వర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమాశంకర్‌గౌడ్, నాయకులు శివాజీ, ఆంజనేయప్రసాద్, సుబ్బారావు పాల్గొన్నారు.
కొడంగల్: చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కొడంగల్‌లో టీడీపీ వికారాబాద్ జిల్లా ప్రచార కార్యదర్శి తలారి శేఖర్, మహబూబ్‌నగర్ పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి డీకే.రాములు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమృతరెడ్డి, మోహన్‌జీ, శాంతికుమార్, వెంకటయ్య, మన్నెబస్వరాజ్ పాల్గొన్నారు.