కేంద్ర పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Dec 28 , 2023 | 12:28 AM
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య పిలుపునిచ్చారు. బుధవారం వికసిత్ భారత్ సంకల్ప యాత్రను సుందరాపురం, కొత్తపేటల్లో నిర్వహించారు.
కేశంపేట, డిసెంబరు 27: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య పిలుపునిచ్చారు. బుధవారం వికసిత్ భారత్ సంకల్ప యాత్రను సుందరాపురం, కొత్తపేటల్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం చివరి వరుసలో ఉన్న వారికీ సంక్షేమ పథకాలు అందేవిధంగా పనిచేస్తుందని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో సుందరాపురం సర్పంచ్ రాములునాయక్, ఏడీఏ రాజారత్నం, నోడల్ అధికారి రవణ్య, డాక్టర్ నిఖిత, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మోటే శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి రొల్లు రాఘురాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.