Share News

అన్ని వర్గాల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:27 PM

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం అన్నారు.

అన్ని వర్గాల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
చేవెళ్లలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం

చేవెళ్ల, డిసెంబరు 17 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం అన్నారు. ఆదివారం చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ దేశంలోని అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. వికసిత్‌ భారత్‌ కార్యక్రమాన్ని ప్రజలకు పూర్తిస్థాయిలో అందించాలన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే భారీ ఆరోగ్య హామీ పథకం ఆయుష్మాన్‌ భారత్‌ ప్రవేశపెట్టారని చెప్పారు. రైతు సంక్షేమానికి సైతం కేంద్ర ప్రభుత్వ భరోసా ఇస్తుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల డిప్యూటీ డీఎంహెచ్‌వో దామోదర్‌, చేవెళ్ల సర్పంచ్‌ బండారు శైలజా ఆగిరెడ్డి, ఏవో తులసీ, ఏఈవో శ్వేత, ఉప సర్పంచ్‌ గంగి యాదయ్య, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడి,్డ జిల్లా నాయకులు శ్రీనివా్‌సగుప్తా, ప్రభాకర్‌రెడ్డి, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:27 PM