‘పట్నం’ ఆర్టీసీ డిపోలో సంబరాలు

ABN , First Publish Date - 2023-01-26T00:40:49+05:30 IST

ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో లాభాల బాటలో నడుస్తున్నందున బుధవారం డిపోలో సంబరాలు నిర్వహించుకున్నారు.

‘పట్నం’ ఆర్టీసీ డిపోలో సంబరాలు
సిబ్బందికి మిఠాయిలు పంచుతున్న ఆర్టీసీ అధికారులు

ఇబ్రహీంపట్నం, జనవరి 25: ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో లాభాల బాటలో నడుస్తున్నందున బుధవారం డిపోలో సంబరాలు నిర్వహించుకున్నారు. డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ జగన్‌, డీఎం కె.రమేష్‌.. ఉద్యోగులకు మిఠాయీలు పంచారు. జనవరి 24వ తేదీ వరకు డిపో రూ.20లక్షల లాభాలు ఆర్జించిందన్నారు. మున్ముందూ సిబ్బంది సహకరించాలని కోరారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల సలహాలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు. అసిస్టెంట్‌ డీఎం శ్రీనివాస్‌, ఎస్‌టీఐ సౌజన్య ఉన్నారు.

Updated Date - 2023-01-26T00:40:49+05:30 IST