కోడలిని వేధిస్తున్న అత్తింటి వారిపై కేసు

ABN , First Publish Date - 2023-05-25T23:54:52+05:30 IST

భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న భార్యను ఓదార్చాల్సిన అత్తామామలు, ఆడపడుచులు ఆస్తి కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు.

కోడలిని వేధిస్తున్న అత్తింటి వారిపై కేసు

శంషాబాద్‌ రూరల్‌, మే 25 : భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న భార్యను ఓదార్చాల్సిన అత్తామామలు, ఆడపడుచులు ఆస్తి కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. దీంతో కోడలు వేగలేక పోలీసులను ఆశ్రయించి వారిపై ఫిర్యాదు చేసిన ఘటన గురువారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని హామీదుల్లానగర్‌కు చెందిన నరిగే శ్యాంబాబు, మమతకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. మూడు నెలల క్రితం శ్యాంబాబు(39) గుండెపోటుతో మృతి చెందాడు. భర్త మృతి చెందినప్పటి నుంచి అత్తామామలు, ఆడపడుచులు మాధవి, అనితతో పాటు బంధువులు నరేష్‌, మహేశ్వర్‌, వెంకట్‌రావు, లహరీలు కలిసి మమత వద్ద ఉన్న ఏటీఎం కార్డు, ఐఫోన్‌, శ్యాంబాబు డెత్‌ సర్టిఫికెట్‌, గోల్డ్‌ బ్రాస్‌లెట్‌, కారు తీసేసుకున్నారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు వారిపై 498ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2023-05-25T23:54:52+05:30 IST