కుసుమ సాగులో మెలకువలు పాటించాలి

ABN , First Publish Date - 2023-01-21T23:07:40+05:30 IST

కుసుమపంటలో చీడల పీడల నివారణకు మెలకువలు పాటించాలని షాద్‌నగర్‌ ఏడీఏ రాజారత్నం, ఏరువాక శాస్త్రవేత్త రామకృష్ణబాబు రైతులకు సూచించారు.

కుసుమ సాగులో మెలకువలు పాటించాలి

కొత్తూర్‌, జనవరి 21: కుసుమపంటలో చీడల పీడల నివారణకు మెలకువలు పాటించాలని షాద్‌నగర్‌ ఏడీఏ రాజారత్నం, ఏరువాక శాస్త్రవేత్త రామకృష్ణబాబు రైతులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని కుమ్మరిగూడ, రెడ్డిపాలెం గ్రామాల్లో కుసుప పంటలను ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. కుసుమ పంటలో పచ్చ పురుగు, పేనుబంక, ఆకుపచ్చ తెగులు, ఎండు తెగులు ఆశిస్తున్నాయని తెలిపారు. వీటి నివారణకు ఇమామిక్టిన్‌ బెంజొయెట్‌ అనే ద్రావకాన్ని పిచికారి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో అనిత, రైతులు భోజిరెడ్డి, జైహింద్‌, భాస్కర్‌, థామ్‌సరెడ్డి ఉన్నారు.

Updated Date - 2023-01-21T23:07:41+05:30 IST