పుట్టిన రోజు వేడుకకు పిలిచి.. చితక బాది

ABN , First Publish Date - 2023-02-15T00:32:56+05:30 IST

తన కొడుకు పుట్టిన రోజు వేడుకకు బంధువులను పిలిచిన యువకుడు అనంతరం తాగిన మైకంలో బంధువులపై కర్రతో దాడి చేసిన సంఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది.

పుట్టిన రోజు వేడుకకు పిలిచి.. చితక బాది

తాగిన మైకంలో వ్యక్తి హల్‌చల్‌

వికారాబాద్‌, ఫిబ్రవరి 14: తన కొడుకు పుట్టిన రోజు వేడుకకు బంధువులను పిలిచిన యువకుడు అనంతరం తాగిన మైకంలో బంధువులపై కర్రతో దాడి చేసిన సంఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌ మండలం అత్తెల్లికి చెందిన నవీన్‌కుమార్‌ సోమవారం రాత్రి తన కొడుకు పుట్టిన రోజు వేడుక నిర్వహించాడు. వేడుకకు బంధువులను పిలిచాడు. రాత్రి వేడుకల్లో ఉన్న కుటుంబీకులపై నవీన్‌ విశ్వరూపం చూపించాడు. తాగిన మైకంలో కారు నడుపుతానన్నాడు. వద్దని వారించడంతో నవీన్‌కుమార్‌ కర్రతో వారిపై దాడిచేశారు. బాధితుడు రాజు 100కు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-02-15T00:32:57+05:30 IST