Share News

బీఆర్‌ఎస్‌ది డబ్బుల రాజకీయం

ABN , First Publish Date - 2023-11-10T23:49:42+05:30 IST

బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ డబ్బుల రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఆరోపించారు. ఆలంపల్లి అనంతపద్మనాభ స్వామి ఆలయంలో శుక్రవారం పూజలు చేసిన దర్గా, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

 బీఆర్‌ఎస్‌ది డబ్బుల రాజకీయం
నామినేషన్‌ వేస్తున్న మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌

వికారాబాద్‌, నవంబరు 10: బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ డబ్బుల రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఆరోపించారు. ఆలంపల్లి అనంతపద్మనాభ స్వామి ఆలయంలో శుక్రవారం పూజలు చేసిన దర్గా, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదిస్తున్నారని అన్నారు. ప్రచారం కోసం గ్రామాలకు వెళితే స్వచ్ఛందంగా వస్తున్నారన్నారు. ఎంపీ రంజిత్‌రెడ్డి ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు కానీ, ఆయన అసెంబ్లీ ఎన్నికల తరువాత వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల కోసం కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటి నుంచే పని చేస్తూ ముందుకు వెళుతున్నారని, అయినప్పటికీ ఆయనను ఈ ప్రాంత ప్రజలు నమ్మరని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వెనుకబడి లేదని వేగంగా ముందుకు వెళుతోందని చెప్పారు. కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ వికారాబాద్‌లో గెలిచి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు సత్యనారాయణ, సుభాష్‌ యాదవ్‌, కొండల్‌రెడ్డి, హన్మంత్‌ రెడ్డి, రాములు, నర్సిములు, బస్వలింగం, అనన్య చేతన్‌, ఎర్రవల్లి జాఫర్‌ ఉన్నారు.

Updated Date - 2023-11-10T23:49:43+05:30 IST