టికెట్ల కేటాయింపుతో బీఆర్‌ఎస్ సంబరాలు
ABN , First Publish Date - 2023-08-22T00:13:52+05:30 IST
షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు సోమవారం కేసీఆర్ మరోసారి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో మండలంలో బీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.
కేశంపేట, ఆగస్టు 21: షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు సోమవారం కేసీఆర్ మరోసారి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో మండలంలో బీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. మండల పరిషత్ వద్ద టపాసులు కాల్చారు. కార్యక్రమంలో నారాయణ రెడ్డి, విశ్వానాథం, దశరథ్, మురళి, ప్రభాకర్‌రెడ్డి, గోపాల్, వెంకటేష్, రమేష్ పాల్గొన్నారు.
షాద్‌నగర్:అంజయ్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయిం చడంపై షాద్‌నగర్ పట్టణ చౌరస్తాలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి పెట్టారు. అంజన్న నాయకత్వం వర్దిల్లాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
కొత్తూర్: అంజయ్యయాదవ్‌కు మరోసారి టికెట్ దక్కడంతో మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ సంబురాలు చేసుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్యదేవేందర్‌యాదవ్, వైస్ చైర్మన్ డి.రవీందర్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణ, జనార్ధన్‌చారి, జనార్ధన్‌రెడ్డి, రాఘవేందర్‌యాదవ్, నర్సింహ పాల్గొన్నారు.
చౌదరిగూడ: ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు మరో సారి టికెట్ దక్కడంతో జిల్లేడ్-చౌదరిగూడలో బీఆర్‌ఎస్ శ్రేణులు టాపాసులు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో యాదయ్య, చంద్రబాబుగౌడ్, శేఖర్‌యాదవ్, జబ్బార్, ఆసీ్‌ఫ,సద్దాం, అజ్మీరీ, మల్లేష్, అంజ య్య, శివరాజ్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కేసీఆర్ మరకోసారి టికెట్ కేటాయించ డంతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఇబహీంపట్నంలో సంబరా లు చేసుకున్నాయి. చౌరస్తాలో టాపాసులు పేల్చి మిఠాయీలు పంచుకున్నారు. క్యాంప్ కార్యాలయ వద్ద ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఎంపీపీ కృపేష్, మున్సిపల్ వైస్‌చైర్మన్ యాదగిరి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, ఏనుగు బుచ్చిరెడ్డి, రమే్‌షరాజు, కిరణ్, జె.రాజు, శేఖర్‌గౌడ్ ఉన్నారు.
శంషాబాద్ రూరల్: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకా ష్‌గౌడ్‌కు మరోసారి టికెట్ రావడంతో జడ్పీటీసీ నీరటి తన్వీ రాజు, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, సర్పంచ్‌ల సం ఘం అధ్యక్షుడు దండుఇస్తారి, నాయకులు హర్షం వ్య క్తం చేశారు. క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
శంషాబాద్: ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌కు టికెట్ కేటాయించడంతో శంషాబాద్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మారెడ్డి, నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
ఆమనగల్లు: కల్వకుర్తి బీఆర్‌ఎస్ టికెట్ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు దక్కడంతో ఆమనగల్లులో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పత్యనాయక్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సీఎల్.శ్రీనివా్‌సయాదవ్, జెడ్పీటీసీ అనురాధపత్యనాయక్, నిట్ట నారాయణ, డి.కుమార్, నిరంజన్‌గౌడ్, ఖలీల్, రాధమ్మ వెంకటయ్య, సోనజయరాం, వెంకటేశ్, భీమయ్య, రవీందర్‌నాయక్, రమేశ్‌నాయక్, రంజిత్, యాదగిరి, శివ, సాయిలు, సత్యం పాల్గొన్నారు.
కడ్తాల్:జైపాల్‌యాదవ్‌కు టికెట్ కేటాయించడంతో కడ్తాలలో సంబరాలు జరుపుకున్నారు. జెడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచారు. లచ్చిరాంనాయక్, వీరయ్య, ప్రియరమేశ్, సేవ్య, హర్యనాయక్, లాయక్‌అలీ, అంజీ, శ్రీను, రామకృష్ణ, ఇర్ష్యద్ పాల్గొన్నారు.
తలకొండపల్లి: తలకొండపల్లిలో నాయకులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. నాయకులు శేఖర్, జగన్‌రెడ్డి, సజ్జుపాషా, కృష్ణయ్య, సత్తయ్య, మల్లేశ్, లక్ష్మికాంత్, రాములు, పాండు, లక్ష్మయ్య పాల్గొన్నారు.
చేవెళ్ల: చేవెళ్ల నుంచి ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో మండల బీఆర్‌ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చేవెళ్లలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి, స్వీ ట్‌పంచుకున్నారు. వైస్‌ఎంపీపీ శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ రంగారెడ్డి, వైస్‌చైర్మన్ నర్సింలు, ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, కృష్ణ, మహేశ్ పాల్గొన్నారు.
‘ప్రజలు కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు’
షాద్‌నగర్ అర్బన్:రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలననే మరోసారి కోరుకుంటున్నారని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. తనకు నాల్గోసారి టికెట్ ఇచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాల్లో పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి గెలిపించడం ఖాయం అన్నారు. రాష్ట్ర సొసైటీ చైర్మన్ వి.రాజావరప్రసాద్ మా ట్లాడుతూ.. అధిష్ఠానం టికెట్ ఇచ్చిన అభ్యర్థి విజయా నికి కలిసికట్టుగా శ్రమించాలన్నారు. అంజయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్పీ వైస్‌చైర్మన్ గణేష్, మున్సిపల్ చైర్మన్ కె.నరేందర్, ఎంపీపీ ఇద్రీష్ కోరారు.
విధేయత.. పనితీరుతోనే టికెట్ కేటాయింపు
ఆమనగల్లు: కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వ యంతో పనిచేస్తామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నా రు. తన పని విధానం, ప్రజల్లో ఉన్న విశ్వాసం, పార్టీ పట్ల విధేయత వల్లే తనకు కేసీఆర్ మూడోసారి టికెట్ ఇచ్చారన్నారు. జైపాల్‌యాదవ్ పార్టీ శ్రేణులతో కలిసి ఆ మనగల్లు మండల పరిషత్‌కు ర్యాలీగా చేరుకొని అం బేడ్కర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రె్‌సల డిపా జిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. ప్రభుత్వ సంక్షే మాభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎ్‌సకు 60వేల సభ్యత్వాలు ఉన్నాయని, కల్వకుర్తి అభివృద్ధికి కృషిచేస్తానన్నారు.