Share News

బీఆర్‌ఎస్‌, బీజేపీలకు గుణపాఠం చెప్పాలి

ABN , First Publish Date - 2023-10-30T23:56:38+05:30 IST

ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి, షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వీర్లపల్లి శంకర్‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీలకు గుణపాఠం చెప్పాలి
వృద్ధురాలికి పాదాభివందనం చేస్తున్నకాంగ్రెస్‌ అభ్యర్థి వీర్లపల్లి శంకర్‌

కొత్తూర్‌,అక్టోబరు 30: ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి, షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వీర్లపల్లి శంకర్‌ అన్నారు. మల్లాపూర్‌, మల్లాపూర్‌ తండా, గుడూర్‌ గ్రామాల్లో సోమవారం ప్రచారం నిర్వహించారు. గుడూర్‌ మాజీ ఎంపీటీసీ మోది దర్శన్‌, మాజీ సర్పంచ్‌ మనీలసంజీవ, మల్లేష్‌, శేఖర్‌ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. గ్రామాల్లో నాయకులు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌, బీజేపీ లోపాయికారి ఒప్పందాలు చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లోనే పల్లెలు పచ్చగా ఉండేవాన్నారు. తనను ఒక్కసారి గెలిపిస్తే నిజమైన ప్రజాసేవ ఎలా ఉంటుందో, అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని శంకర్‌ అన్నారు. గుడూర్‌లో ఓ వృద్ధురాలి కాళ్లకు వీర్లపల్లి దండంపెట్టి చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో కేశంపేట జడ్పీటీసీ విశాలశ్రవణ్‌, మాజీ జడ్పీటీసీ శ్యాంసుదర్‌రెడ్డి, సర్పంచ్‌లు సాయిలు, ప్రభాకర్‌, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, చంద్రపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు హరినాథ్‌రెడ్డి, రాంరెడ్డి, బాలశౌరిరెడ్డి, సుదర్శన్‌గౌడ్‌, శ్రీనివాస్‌, రాందా్‌సనాయక్‌, బాలయ్య, ఉప్పల దయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T23:56:38+05:30 IST