గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2023-06-26T23:31:26+05:30 IST
కీసర పోలీ్‌సస్టేషన్ పరిధిలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
కీసర, జూన్ 26: కీసర పోలీ్‌సస్టేషన్ పరిధిలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చీర్యాల్ గ్రామ వీఆర్‌ఏ కోల నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుందన్‌పల్లి రోడ్డులో దాదాపు 35సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నీలం రంగు చొక్కా, ప్యాంట్ ధరించినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.