ఏదులాబాద్‌లో ఘనంగా బొడ్రాయి పండుగ
ABN , First Publish Date - 2023-05-08T00:19:34+05:30 IST
ఘట్‌కేసర్ మండల పరిధి ఏదులాబాద్‌లో రెండు రోజులుగా బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి బలిహారణ కార్యక్రమం నిర్వహించారు.
ఘట్‌కేసర్ రూరల్ మే 7 : ఘట్‌కేసర్ మండల పరిధి ఏదులాబాద్‌లో రెండు రోజులుగా బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి బలిహారణ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి కట్టమైసమ్మ అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శఽరత్‌చంద్రారెడ్డిలు కట్టమైసమ్మఅమ్మవారిని దర్శించుకొని బొడ్రాయి వద్ద పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాలేరు సురేష్, ఉపసర్పంచ్ లింగేశ్వర్‌రావు, ఎంపీటీసీలు కందుల సరళాకుమార్, గట్టగల్ల రవి, తదితరులు పాల్గొన్నారు.