బైక్-జీపు ఢీ.. ఒకరి దుర్మరణం
ABN , First Publish Date - 2023-02-21T00:41:08+05:30 IST
బుద్ధారం వాగు సమీపంలో సోమవారం బైక్, జీపు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి.
పెద్దేముల్, ఫిబ్రవరి 20: బుద్ధారం వాగు సమీపంలో సోమవారం బైక్, జీపు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బుద్ధారానికి చెందిన మంతటి శ్రీనివా్‌స(18)అనే వ్యక్తి బైక్‌పై పెద్దేముల్ వైపు వెళ్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తలారి శ్రీనివాస్ జీపులో బుద్ధారం వెళ్తున్నాడు. వాగు సమీపంలోకి రాగానే బైక్, జీపు ఢీకొన్నాయి. బైక్‌పై ఉన్న శ్రీనివాస్, నాగులపల్లికి చెందిన మహే్‌షగౌడ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. జీపుడ్రైవర్ తలారి శ్రీనివా్‌సకు సైతం గాయాలయ్యాయయి. క్షతగాత్రులను తాండూరు జిల్లాఆస్పత్రికి తరలించగా మంతటి శ్రీనివాస్ మృతిచెందాడు. టి.శ్రీనివా్‌సను వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.