షాద్‌నగర్‌లో బైక్‌ల చోరీ

ABN , First Publish Date - 2023-02-17T00:29:15+05:30 IST

షాద్‌నగర్‌లో గురువారం రెండు బైక్‌లు చోరీకి గురయ్యాయి.

షాద్‌నగర్‌లో బైక్‌ల చోరీ

షాద్‌నగర్‌, ఫిబ్రవరి 16: షాద్‌నగర్‌లో గురువారం రెండు బైక్‌లు చోరీకి గురయ్యాయి. షాద్‌నగర్‌కు చెందిన జర్నలిస్టు టంగుటూరి సంజయ్‌కుమార్‌ బుధవారం రాత్రి తన విధులు ముగించుకొని తన ఇంటి ఎదుట ఏపీ 28 ఆర్‌ 2729 బైక్‌ను ఉంచాడు. గురువారం ఉదయం చూస్తే తన వాహనం కనిపించలేదు. దీంతో సంజయ్‌కుమార్‌ షాద్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. అదేవిధంగా పట్టణంలో మరో బైక్‌ చోరీకి గురైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. నిందితులను గుర్తించి వారిని వాహనాలను స్వాధీనం చేసుకుంటామని సీఐ నవీన్‌కుమార్‌, క్రైమ్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

Updated Date - 2023-02-17T00:29:17+05:30 IST