Share News

బీఆర్‌ఎ్‌సకు భారీ షాక్‌

ABN , First Publish Date - 2023-10-18T00:00:22+05:30 IST

షాద్‌నగర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎ్‌సకు భారీ షాక్‌ తగిలింది. ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి, ఇద్దరు జడ్పీటీసీ సభ్యులు, భారీగా కార్యకర్తలు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరాలని నిర్ణయించుకున్నారు.

బీఆర్‌ఎ్‌సకు భారీ షాక్‌
రేవంత్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి, జడ్పీటీసీలు తాండ్ర విశాల, పి.వెంకట్‌రాంరెడ్డి తదితరులు

కాంగ్రె్‌సలో చేరాలని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి నిర్ణయం

రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇప్పటికే భారీగా చేరికలు

షాద్‌నగర్‌ అర్బన్‌/కొత్తూర్‌/కేశంపేట, అక్టోబరు 17: షాద్‌నగర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎ్‌సకు భారీ షాక్‌ తగిలింది. ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి, ఇద్దరు జడ్పీటీసీ సభ్యులు, భారీగా కార్యకర్తలు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరాలని నిర్ణయించుకున్నారు. పీసీసీ చీఫ్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి, షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వీర్లపల్లి శంకర్‌ సోమవారం రాత్రి స్వయంగా శంషాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రె్‌సలోకి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎ్‌సకు చెందిన ఫరూఖ్‌నగర్‌ జడ్పీటీసీ పి. వెంకట్‌రాంరెడ్డి, కేశంపేట జడ్పీటీసీ సభ్యురాలు తాండ్ర విశాలశ్రవణ్‌రెడ్డిలతో పాటు కొత్తూర్‌ మాజీ జడ్పీటీసీ మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, కొత్తూర్‌ మాజీ సర్పంచ్‌ సుదర్శన్‌గౌడ్‌, నందిగామ మాజీ సర్పంచ్‌ వి.నీలమ్మ, కొందుర్గు సర్పంచ్‌ భర్త కావలి యాదయ్య, మధురాపురం సర్పంచ్‌ ఎల్‌.శివశంకర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మైనారిటీ నాయకుడు జమృద్‌ఖాన్‌ తదితరులు రేవంత్‌రెడ్డిని కలిశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్‌ అభయం ఇవ్వడంతో వారందరూ కాంగ్రె్‌సలో చేరుతామని, పార్టీ విజయానికి శ్రమిస్తామని ప్రకటించారు. కొత్తూర్‌ మండలంలోని జేపీ దర్గాలో ఈ నెల 26న వీర్లపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కందూర్‌కు రేవంత్‌రెడ్డి హాజరవుతారని, ఆయన సమక్షంలో చౌలపల్లి ప్రతార్‌రెడ్డితో పాటు ఇద్దరు జడ్పీటీసీలు, ముఖ్యనాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు

కాగా, వీర్లపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో మంగళవారం నియోజకవర్గంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లను రేవంత్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేర్చుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారిలో రరనఎదిర సర్పంచ్‌ బాల్‌రాజ్‌, కాసులబాద్‌, మల్లాపూర్‌, వెంకిర్యాల, ఫీర్జాపూర్‌, లింగంధన సర్పంచులు చిర్ర సాయిలు, లింగంగౌడ్‌, రాములు, నాగిళ్ల ప్రతా్‌పతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీ కేశంపేట మండలాధ్యక్షుడు గూడ వీరేశ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగదీశ్వరప్ప, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు భాస్కర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో రేవంత్‌ సమక్షంలో పార్టీలో చేరారు. కేశంపేట మండలం నుంచి మరో ఐదుగురు సర్పంచ్‌లు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కొత్తూరుచ కొందుర్గు మండలాల్లోని పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీలో చేరారు. ఫరూఖ్‌నగర్‌ మండలం మధురాపురం సర్పంచ్‌ ఎల్‌.శివశంకర్‌రెడ్డి, రంగంపల్లి సర్పంచ్‌ శ్రీనివా్‌సయాదవ్‌లు ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, కల్వకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డిలను మంగళవారం కలిశారు.

Updated Date - 2023-10-18T00:00:41+05:30 IST