భగ్గుమన్న కాంగ్రెస్
ABN , First Publish Date - 2023-03-19T23:40:05+05:30 IST
పేపర్ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపుమేరకు నాయకులు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై ధర్నా, నిరసనలు
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దిష్టిబొమ్మల దహనం
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, తదితరులు
ఇబ్రహీంపట్నం/యాచారం/కందుకూరు/కొందుర్గు/ఆమనగల్లు/కడ్తాల్,/తలకొండపల్లి/చౌదరిగూడ/కొత్తూర్/చేవెళ్ల, మార్చి 19: టీఎ్‌సపీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపుమేరకు నాయకులు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా, పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్, ఆయన పీఏ తిరుపతి పాత్ర ఉందని, వారిని వెంటనే పదవుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలతో కల్వకుంట్ల కుటుంబం ఆటలాడుకుంటుదని, వారిని తరిమికొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. గవర్నర్ తమిళిసై చొరవ తీసుకుని సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. మున్సిపల్ అధ్యక్షుడు ఆకుల ఆనంద్, కౌన్సిలర్ శంకరయ్య, నాయకులు దాసు, ప్రవీణ్‌కుమార్, వీరే్‌షకుమార్, తదితరులున్నారు. పరీక్షా పత్రం లీకేజీని నిరసిస్తూ యాచారం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మండలాధ్యక్షుడు ఎం.నర్సింహ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని విమర్శించారు. తాడిపర్తి సర్పంచ్ రమేష్, నాయకులు జగన్, సంపత్‌కుమార్ తదితరులున్నారు. పేపర్ లీకేజీలో బీఆర్‌ఎస్, బీజేపీ నేతల పాత్ర ఉందని, సంబంధిత దోషులను వెంటనే శిక్షించాలని రంగారెడ్డి జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి అఫ్జల్‌బేగ్, ఆ పార్టీ సీనియర్ నేత గంగుల ప్రభాకర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ కందుకూరు మండలాధ్యక్షుడు సౌడపు వెంకటే్‌షగౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని హైద్రాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీని దహనం చేశారు. డిల్లీ శ్రీధర్, ఎస్.గణే్‌షనాయక్, ఎండీ ఖాజా మొహినుద్ధీన్, గుండ్ర సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. కొందుర్గు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి, కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గోవర్థన్‌గౌడ్, రాయికంటి రామస్వామి, మల్లయ్య, వెంకటేష్ తదితరులున్నారు.
నిరుద్యోగ యువత జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతుందని పీసీసీ సభ్యుడు శ్రీనివా్‌సగౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివా్‌సరెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్యానాయక్, ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహలు అన్నారు. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమనగల్లు పట్టణంలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మండ్లీ రాములు ఆధ్వర్యంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై రాజీవ్ చౌరస్తా వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఆమనగల్లు పట్టణాధ్యక్షుడు వస్పుల మాణయ్య, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఖలీల్, నాయకులు చేగూరి వెంకటేశ్, కృష్ణనాయక్, కొప్పు రాఘవేందర్, తదితరులున్నారు. కడ్తాల మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు బిచ్యానాయక్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసి బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిక్యానాయక్, శ్రీనివా్‌సరెడ్డి, యాట నర్సింహ, జహంగర్‌బాబా తదితరులున్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన నిరసనలో మోహన్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి, యాట నర్సింహ, బిక్యానాయక్, అజీం, ఇమ్రాన్, జనార్ధన్‌రెడ్డి, రవీందర్ యాదవ్, కృష్ణ, బాబా, వెంకటేశ్, ఆదిల్, తదితరులు పాల్గొన్నారు. జిల్లేడ్ చౌదరిగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చలివేంద్రంపల్లి రాజు అధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నాయకులు సత్యనారాయణరెడ్డి, సలీం, దామోదర్, యాదగిరి, సత్యయ్య, తదితరులున్నారు. కొత్తూరు మున్సిపల్ కౌన్సిలర్ మాదారం నర్సింహగౌడ్ ఆధ్వర్యంలో స్థానిక బైపాస్ రోడ్డు వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నర్సింహగౌడ్ మాట్లాడుతూ పేపర్ లీకేజీపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి దోషులను శిక్షించాలన్నారు. నాయకులు జె.శ్రీను, మాదారం కృష్ణాగౌడ్, గోపాల్‌నాయక్, వెంకటే్‌షనాయక్, పరందాములుగౌడ్, విఠల్‌చారి తదితరులున్నారు. పేపర్ లీకేజీ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం హస్తం ఉందని డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్‌స్వామి, పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఎ్‌సపీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, పామెన మాజీ సర్పంచ్ గోపాల్‌రెడ్డి, మండల ఉపాఽధ్యక్షుడు పాండు యాదవ్, పెంటయ్య గౌడ్, బాలయ్య, జనార్దన్, మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, మైనారిటీ సెల్ నాయకుడు అబ్దుల్, తదితరులున్నారు.
కవిత, కేటీఆర్‌లను దేనితో కొట్టాలి ? : వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్ : అధికారులు లంచం అడిగినా.. అవినీతికి పాల్పడినా వారిని చెప్పుతో కొట్టాలని నాడు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ నేడు లిక్కర్ కేసులో కవితను, టీఎ్‌సపీసీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేటీఆర్‌ను దేనితో కొట్టాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, షాద్‌నగర్ నియోజకవర్గ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ప్రశ్నించారు. టీఎ్‌సపీసీ ప్రశ్నా పత్రం లీకేజీ, కవిత లిక్కర్ స్కాంను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం షాద్‌నగర్ పట్టణ చౌరస్తాలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ టీఎ్‌సపీసీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ మంత్రి కేటీఆర్ ప్రకటించడం హాస్యాస్పదమని, మంత్రి హోదాలో ఉండి 30 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడారని, అలాంటప్పుడు ఆయనను దేనితో కొట్టాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇలాంటి అక్రమాలను చూస్తూ ఊరుకోదని, ప్రజల చేతనే చెప్పుతో కొట్టించే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.