సీఎంఆర్‌ఎఫ్‌తో మెరుగైన వైద్యం
ABN , First Publish Date - 2023-03-19T00:03:07+05:30 IST
సీఎంఆర్‌ఎ్‌ఫతో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందుతుందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన సామ యాదిరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

కందుకూరు, మార్చి 18 : సీఎంఆర్‌ఎ్‌ఫతో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందుతుందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన సామ యాదిరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈమేరకు మంజూరైన రూ.45వేల చెక్కును శనివారం ఆ గ్రామ సర్పంచ్ సాధ మల్లారెడ్డితో కలిసి జడ్పీటీసీ జంగారెడ్డి ఆయన చాంబర్‌లో బాధిత కుటుంబానికి అందజేశారు. నాయకులు బొక్క దీక్షీత్‌రెడ్డి, కొలన్ విఘ్నేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.