బీజేపీ గెలిస్తే ‘బీసీ సీఎం’
ABN , First Publish Date - 2023-11-22T00:17:29+05:30 IST
తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారని, బీఆర్‌ఎస్ నియంత పాలనను ఇంటికి సాగనంపుదామని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ, నరెడ్లగూడ, ఆస్పల్లిగూడ, ఎల్గొండగూడ, మీరాపూర్, చర్లగూడ, మరియాపూర్, అంతారం, కేసారం, కక్కులూర్, సర్దార్‌నగర్, కుర్వగూడ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

షాబాద్, నవంబరు 21 : తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారని, బీఆర్‌ఎస్ నియంత పాలనను ఇంటికి సాగనంపుదామని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ, నరెడ్లగూడ, ఆస్పల్లిగూడ, ఎల్గొండగూడ, మీరాపూర్, చర్లగూడ, మరియాపూర్, అంతారం, కేసారం, కక్కులూర్, సర్దార్‌నగర్, కుర్వగూడ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తామని ప్రకటించినట్లు గుర్తుచేశారు. ఎస్సీ కుల వర్గీకరణ చేసేందుకు అంగీకరించారని, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించారని, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఇచ్చారని తెలిపారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారని, రైతు సమ్మాన్ నిధి, పంటలకు మద్దతు ధరల పెంపు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు, వ్యవసాయ సంస్కరణలు చేపట్టారని తెలిపారు. నూతన విద్యా విధానంలో భాగంగా ఐఐటీ, ఎఐఐఎంలలో సీట్లు పెంచారని తెలిపారు. కరోనా సమయంలో భారత్ నుంచి ప్రపంచానికి వ్యాక్సిన్లు అందించామని, ఆ ఘనత మోదీ సర్కార్‌కే దక్కిందన్నారు. 30న జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, బీజేవైఎం స్వచ్చభారత్‌సెల్ రాష్ట్ర కన్వీనర్ రాము, బీజేవైఎం మండలాధ్యక్షుడు మహేష్, నాయకులు రవీందర్‌రెడ్డి, మాణయ్య, మహేందర్, గోపాల్, మహేష్, క్యామ నారాయణ, జైపాల్‌రెడ్డి, గురుస్వామి గ్రామాల శక్తి కేంద్రాల ఇన్‌చార్జీలు, భూత్ కమిటీల సభ్యులు, తదితరులున్నారు.
బీజేపీ గెలుపు తథ్యం
చేవెళ్ల : ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ చేవెళ్ల మండల అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఆయా కాలనీల్లో గడపగడకూ వెళ్లి ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు బాగా ఆలోచించి ఈసారి బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. చేవెళ్ల నుంచి బీజేపీ అఽభ్యర్థి కేఎస్ రత్నంను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో మండల ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, ఉపాధ్యక్షుడు కృష్ణగౌడ్, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, శ్రీనివాస్, అంజనేయులు, దేవుని శర్వలింగం, కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, కుంచం శ్రీనివాస్, రజికాంత్, శివరాజ్, ఐలయ్య, ఆంజనేయులు, సత్యనారాయణ, మాణయ్య, రవీందర్‌రెడ్డి, నారాయణ, మహేందర్, రవిందర్‌గౌడ్, సత్యం శ్రీనివాస్, శ్రీనివా్‌సరెడ్డి, మధుకర్‌రెడ్డి, మల్లారెడ్డి, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.