Share News

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

ABN , First Publish Date - 2023-10-21T00:09:42+05:30 IST

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని వికారాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ గోపాల్‌ అన్నారు. మద్గుల్‌ చిట్టెంపల్లి గ్రామంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
మద్గుల్‌ చిట్టెంపల్లిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

వికారాబాద్‌, అక్టోబరు 20: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని వికారాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ గోపాల్‌ అన్నారు. మద్గుల్‌ చిట్టెంపల్లి గ్రామంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి న తర్వాత ప్రపంచ ఖ్యాతిని పొందిందని తెలిపారు. ఎక్కడా లేని విధంగా పూవ్వులను పూజించే సంస్కృతి మనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు బతుకమ్మ చుట్టూ చేరి ఆడిపాడారు.

ధారూరు: బతుకమ్మ పండుగను శుక్రవారం ధారూరులో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇళ్లలో మహిళలు బతుకమ్మలను తీరొక్కపూలతో పేర్చి పూజలు చేశారు. అనంతరం బతుకమ్మలను గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ వీరభద్రేశ్వర ఆలయంలో మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ సమీప నీటి కుంటలో నిమజ్జనం చేశారు.

పూడూరు: మండలంలోని సోమన్‌గుర్తి అంగన్‌వాడీ కేంద్రం-1లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో శుక్రవారం గ్రామ మహిళలు, అంగన్‌వాడీ టీచర్లు, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటల మధ్య ఉత్సాహంగా సంబురాలు చేసుకున్నారు.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో..

మేడ్చల్‌ టౌన్‌: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ పరిధిలోని సీఎంఆర్‌ సెట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యంతో కలిసి విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పూలతో తయారు చేసిన బతుకమ్మలను కళాశాల ఆవరణలో పేర్చి ఆడారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ చైర్మన్‌ గోపాల్‌రెడ్డి, సీఈవో అభినవ్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీఏ నారాయణ, శ్రీశైలం, రోహిణిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని పలు వార్డుల్లో మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఆయా వార్డుల్లోని వీధుల్లో బతుకమ్మలను పేర్చి మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.

ఘట్‌కేసర్‌: మున్సిపాలిటీ పరిధిలో సద్దుల బతుకమ్మ పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఘట్‌కేసర్‌, బొక్కోనిగూడ, చందుపట్లగూడలలో శుక్రవారం సద్దుల బతుకమ్మను కనుల పండువగా నిర్వహించారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో సద్దుల బతుకమ్మ సంబురాలను పలుచోట్ల ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మలను ప్రధాన చౌరస్తాలలో పెట్టి మహిళలు ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేశారు. అనంతరం బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేశారు.

ఘట్‌కేసర్‌ రూరల్‌: మండలంలోని వెంకటాపూర్‌ అనురాగ్‌ యూనివర్సిటీలో శుక్రవారం సాయంత్రం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ వేడుకలలో తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన పాల్గొని గౌరమ్మకు ప్రత్యేకపూజలు నిర్వహించి బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనురాగ్‌ యూనివర్సిటీ చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఈవో సూర్యదేవర నీలిమ, గేయ రచయిత, కవి సురేందర్‌, వైఎ్‌సచాన్సలర్‌ రామచంద్రం, రిజిస్ట్రార్‌ బాలాజీ ఊట్ల, అధ్యాపకులు శిరీష, సరిత, విద్యార్థినులు, మహిళ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-21T00:09:42+05:30 IST