తెలంగాణ సంస్కృతికి నిదర్శనం ‘బతుకమ్మ’
ABN , First Publish Date - 2023-10-17T23:54:00+05:30 IST
తెలంగాణ సాంస్కృతికి నిదర్శనం బతుకమ్మ పండుగ అని విశ్వ భారతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, నిర్వాహకులు బస్వరాజ్, సత్యనారాయణ గౌడ్‌లు అన్నారు.
వికారాబాద్, అక్టోబరు 17: తెలంగాణ సాంస్కృతికి నిదర్శనం బతుకమ్మ పండుగ అని విశ్వ భారతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, నిర్వాహకులు బస్వరాజ్, సత్యనారాయణ గౌడ్‌లు అన్నారు. కళాశాల ఆవరణలో బతుకమ్మ సంబురాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడా లేనివిధంగా పువ్వులను పూజించడం ఆనవాయితీకి వస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు పోతు రాజుల నృత్యాల మధ్య బతుకమ్మలను పేర్చి విద్యార్థినులు బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు.