బ్యాంకులు పెండింగ్‌ రుణాలను అందజేయాలి

ABN , First Publish Date - 2023-05-25T22:44:42+05:30 IST

బషీరాబాద్‌, పెద్దేముల్‌, యాలాల, తాండూరు మండలాల్లో ఆయా బ్యాంకుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న 86 మంది లబ్ధిదారులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ రుణాలను ఇచ్చేలా బ్రాంచ్‌ల బ్యాంకు మేనేజర్లు చర్యలు చేపట్టాలని జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ డి.రాంబాబు ఆదేశించారు.

బ్యాంకులు పెండింగ్‌ రుణాలను అందజేయాలి
మాట్లాడుతున్న జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాంబాబు

సకాలంలో తిరిగి చెల్లించిన రైతులకు రాయితీ

జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాంబాబు

తాండూరు రూరల్‌, మే 25: బషీరాబాద్‌, పెద్దేముల్‌, యాలాల, తాండూరు మండలాల్లో ఆయా బ్యాంకుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న 86 మంది లబ్ధిదారులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ రుణాలను ఇచ్చేలా బ్రాంచ్‌ల బ్యాంకు మేనేజర్లు చర్యలు చేపట్టాలని జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ డి.రాంబాబు ఆదేశించారు. తాండూరు మండల పరిషత్‌లో తాండూరు ఎస్‌బీఐ-ఏడీబీ అధ్యక్షతన జేఎంఎల్‌బీసీ(జాయింట్‌ మండల్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. రైతులు తీసుకున్న పంట రుణాలను ఏడాది లోపు చెల్లిస్తే ఏడుశాతం వడ్డీ పడుతుందని, అందులో మూడు శాతం కేంద్ర ప్రభుత్వం రాయితీ పోను రైతు కేవలం 4శాతమే రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని బ్రాంచ్‌ల మేనేజర్లు రైతులకు వివరిస్తూ వారిని చైతన్యపర్చాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 75శాతం రుణాలు రికవరీ చేశామన్నారు. పంట రుణం తీసుకొని ఏడాదైనా చెల్లించకుంటే రైతు ఏడుశాతం వడ్డీపై మొత్తంపై 11శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇదే విషయాన్ని రైతులకు వివరించాలని బ్యాంకర్లు మేనేజర్లకు కోరారు. సమావేశంలో ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, హార్టికల్చర్‌ ఏడీ మల్లికార్జున్‌, సెరీకల్చర్‌ ఏడీ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

సమావేశానికి అధికారుల గైర్హాజరు

90 రోజులకొక్కసారి జరిగే జేఎంఎల్‌బీసీ సమావేశానికి వివిధ శాఖల అధికారులు, బ్యాంకు మేనేజర్లు సైతం గైర్హాజరయ్యారు. జేఎంఎల్‌బీసీ సమావేశానికి వ్యవసాయ, ఐకేపీ, బ్యాంకర్స్‌, హర్టికల్చర్‌, సెరికల్చర్‌, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్సీ కార్పొరేషన్ల అధికారులు రావాల్సి ఉంది. అయితే కొందరు బ్యాంకు మేనేజర్లు రాగా.. కొందరు అధికారులు, ఐకేపీ సిబ్బంది గైర్హాజరయ్యారు. అలాంటపుడు బ్యాంకు రుణ లక్ష్యం ఎలా నెరవేరుతుందని పలువురు చర్చింకున్నారు.

Updated Date - 2023-05-25T22:44:42+05:30 IST