ప్రజలకు అందుబాటులో ఉంటా
ABN , First Publish Date - 2023-12-10T23:00:24+05:30 IST
నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం అడుగు పెట్టారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
క్యాంప్ కార్యాలయంలో అడుగిడిన ఎమ్మెల్యే
షాద్‌నగర్/కొత్తూర్/నందిగామ, డిసెంబరు 10 : నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయం మేరకు ప్రజాపాలన అందించేందుకు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. కొన్ని అత్యవసర పరిస్థితుల వల్ల తాను అందుబాటులో లేకున్నా నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా క్యాంపు కార్యాలయంలో అందజేస్తే.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని, త్వరలోనే ప్రజాపాలనపై దృష్టి సారిస్తానని వీర్లపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి, బాబర్‌ఖాన్, చెంది తిరుపతిరెడ్డి, బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నేరవేరుస్తాం
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూర్ మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ జె.వేణుగోపాల్‌గౌడ్ ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అలాగే ఫాతిమాపూర్, రెడ్డిపాలెం, మల్లాపూర్, ఇన్ముల్‌నర్వ, గుడూర్, మక్తగూడ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించగా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సన్మానించి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో నిరుపేదలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతారన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. సర్పంచులు ప్రభాకర్, సాయిలు, నాయకులు బాల్‌శౌవ్‌రెడ్డి, రవికుమార్ గుప్త, జె.రాంరెడ్డి, జె.సుదర్శన్‌గౌడ్, సత్తయ్య, శంకరయ్యగౌడ్, హరినాథ్‌రెడ్డి, దయానంద్‌గుప్త, సంజీవ, ఎర్రొళ్ల జగన్, మోది దర్శన్, జగన్‌గౌడ్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నందిగామ మండలకేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో అయ్యప్పలకు అయ్యప్పలకు మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి అన్నదానం చేశారు. వీర్లపల్లి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయకమిటీ సభ్యులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా నందిగామ మండల పరిధిలోని అంతిరెడ్డిగూడలో వీర్లపల్లి శంకర్ గెలిచిన సందర్భంగా అభిమానులు ఎల్లమ్మ దేవాలయంలో 201 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. గురుస్వామి గిరీ్‌షనాయర్, దేవాలయకమిటీ సభ్యులు లక్ష్మయ్య, హరిజీవన్, తుమ్మల నర్సింలు, బంటారం సుదర్శన్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, జంగయ్యగౌడ్ నాయకులు మాజి ఎంపీపీ గోపాల్‌గౌడ్, జిల్లెల్ల రాంరెడ్డి, కుమార్‌గౌడ్, కొమ్ము కృష్ణ, చంద్రపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.