పథకాలకు ఆకర్షితులై బీఆర్‌ఎ్‌సలో చేరికలు

ABN , First Publish Date - 2023-06-11T23:18:17+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌ లో చేరికలు కొనసాగుతున్నాయని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు.

పథకాలకు ఆకర్షితులై బీఆర్‌ఎ్‌సలో చేరికలు
దాదాపూర్‌లో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరిన యువకులు

దోమ, జూన్‌ 11: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌ లో చేరికలు కొనసాగుతున్నాయని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని దాదాపూర్‌ గ్రామంలో దాదాపు 70మంది యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. గ్రామానికి చెందిన సాలెటి బాబు, దస్తయ్య, బుగ్గయ్య, కృష్ణయ్య, ప్రతాప్‌, సురేశ్‌, బాబు, పద్మమ్మ, చెన్నమ్మ, ఎల్లమ్మ తదితరులు బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగిరెడ్డి, నాయకులు దస్తయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారానికే ‘పల్లెబాట’

కులకచర్ల: ప్రజలు సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చేపడుతామని, అందుకే పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పరిగి ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డి తెలిపారు. పల్లెబాట కార్యక్రమం 2వ రోజు చౌడాపూర్‌ మండలంలోని కొత్తపల్లి, కొత్తపల్లి తండా, పుర్సంపల్లి, మక్తవెంకటాపూర్‌, మందిపాల్‌, చౌడాపూర్‌, విఠలాపూర్‌, ఈర్లవాగు తండాలో ఆదివారం పర్యటించారు. గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వివరించగా సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌, సొసైటీ వైస్‌ చైర్మన్‌ నాగరాజుయాదవ్‌, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్‌ పీరంపల్లి రాజు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T23:18:17+05:30 IST