Share News

ఆస్తి తగాదాలో దాడి.. వ్యక్తి మృతి

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:11 AM

ఆస్తిలో వాటా కోసం జరిగిన తగాదాలో వ్యక్తిపై దాడి చేయడంతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఆస్తి తగాదాలో దాడి.. వ్యక్తి మృతి

కొడంగల్‌, డిసెంబరు 16: ఆస్తిలో వాటా కోసం జరిగిన తగాదాలో వ్యక్తిపై దాడి చేయడంతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన కొడంగల్‌ మండలంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొడంగల్‌ సీఐ ఏ.రాములు తెలిపిన వివరాల ప్రకారం.. రావుల్‌పల్లి గ్రామానికి చెందిన మాల భీమప్పకు మాల రాములు, మాల హన్మంతు ఇద్దరు కుమారులు. ఆస్తి పంపకం విషయంలో ఇద్దరు కుమారులు వాటా ఇప్పించాలని తల్లి లక్ష్మమ్మతో ఈనెల 13న మధ్యాహ్నం అడుగుతుండగా తమ్ముడు అయిన మాల రాములు తన కర్రతో హన్మంతు(34)ను బలంగా కొట్టాడు. దీంతో హన్మంతు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 14న మృతి చెందాడు. మృతుడి భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో మాల రాములుపై కేసు నమోదుతో శనివారం కోర్టులో హాజరు పర్చనున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 12:11 AM