ఉద్యమంలో కళాకారులది ముఖ్య భూమిక

ABN , First Publish Date - 2023-06-11T23:28:09+05:30 IST

తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు ముఖ్య భూమిక పోషించారని జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు అన్నారు.

ఉద్యమంలో కళాకారులది ముఖ్య భూమిక
కవిని సన్మానిస్తున్న జిల్లా అధికారులు

జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు

రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 11 : తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు ముఖ్య భూమిక పోషించారని జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కొంగరకలాన్‌లో జరిగిన తెలంగాణ సాహిత్య దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది అమర వీరుల త్యాగాల ఫలితంగా రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, పోరాడి సాధించుకున్న తెలంగాణ అన్నిరంగాలలో అభివృద్ధి సాధిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధే అమరులకు అసలైన నివాళి అని అన్నారు. కవులు, కళాకారులు, సాహితీవేత్తలను గౌరవించుకోవాలని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాహితీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో 48 మంది కవులు పాల్గొని తమ కవితలను వినిపించారు. అనంతరం కవులను సన్మానించి ప్రశంసా పత్రంతోపాటు రూ. 1,116 పారితోషికం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జడ్పీ సీఈఓ దిలీప్‌ కుమార్‌, జడ్పీ డిప్యూటీ సీఈఓ రంగారావు, కేశంపేట జడ్పీటీసీ, చైల్డ్‌వెల్ఫేర్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ విశాల, ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, జిల్లా యువజన క్రీడల అధికారి ఈ.వెంకటేశ్వరరావు, కవులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T23:28:09+05:30 IST