అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2023-11-20T23:44:55+05:30 IST
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని సోమవారం కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీసర పోలీస్ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

కీసర రూరల్, నవంబరు 20: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని సోమవారం కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీసర పోలీస్ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జవహర్‌నగర్‌లో నివసించే మాలోతు సురేష్ అనే వ్యక్తి జవహర్‌నగర్, దమ్మాయిగూడ, కీసర ప్రాంతాల్లో లబ్దిదారుల నుండి రేషన్ బియ్యాన్ని సేకరించి, విక్రయిస్తున్నాడు. ఆయా ప్రాంతాల్లో సేకరించిన బియ్యాన్ని భువనగిరికి తరలిస్తుండగా, సమాచారం అందుకున్న కీసర పోలీసులు కాపుకాచి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నాలుగు టన్నుల బియ్యాన్ని, టాటా ఏస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.