మోదీ పర్యటనకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2023-11-21T23:52:11+05:30 IST
ఈ నెల 25వ తేదీన భారత ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లాకు రానున్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో 25వ తేదీ సాయంత్రం 3గంటలకు నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

మహేశ్వరం: ఈ నెల 25వ తేదీన భారత ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లాకు రానున్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో 25వ తేదీ సాయంత్రం 3గంటలకు నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని సభకు భారీగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తుక్కుగూడలోని ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ సమీపంలో నిర్వహిస్తున్న సభా స్థలాన్ని మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, అధికార ప్రతినిధి వీరేందర్‌గౌడ్ పరిశీలించారు.