వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు
ABN , First Publish Date - 2023-09-21T23:22:16+05:30 IST
గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వికారాబాద్, సెప్టెంబరు 21: గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డితో పాటు అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, లింగ్యానాయక్, అసిస్టెంట్ ట్రెయినీ కలెక్టర్ అమిత్ నారాయణలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. కలెక్టరేట్ సమీపంలోని నీటికుంటలో నేడు(శుక్రవారం) వినాయక నిమజ్జనం చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారి గోపాల్, డీపీవో తరుణ్ కుమార్, డీవైఎ్‌సవో హన్మంత్‌రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంబాబు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివా్‌సరెడ్డి, మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో అమరేందర్ కృష్ణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గణనాథుడికి ప్రత్యేకపూజలు
వికారాబాద్: ఇందిరానగర్‌లో శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల రమేష్ పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అర్ధ సుధాకర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ రమేష్, మాజీ కౌన్సిలర్ బోండాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తాండూరు: హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో ప్రతిష్ఠించిన సుమారు 300కు పైగా విగ్రహాలను శుక్రవారం(నేడు) యాలాల మండలం కోకట్ కాగ్నానదిలో నిమజ్జనం చేయనున్నారు. ఈమేరకు హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు ఏర్పాట్లను పరిశీలించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న, యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా తదితరులు కోకట్ కాగ్నానదిని పరిశీలించారు. ఐదురోజుల పాటు నిత్యపూజలు అందుకున్న గణనాథులను సామూహిక ఊరేగింపు ద్వారా సాగనంపనున్నారు. ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లాకు చెందిన సుమారు 300మంది పోలీసుల సిబ్బందితో సీసీ కెమెరాల నిఘా, మఫ్టీ పోలీసులతో బందోబస్తును పర్యవేక్షించనున్నారు. ప్రత్యేక కంట్రోల్ రూంను పోలీసులు ఏర్పాటు చేశారు. మొదట పాతతాండూరు గడి వినాయకుడిని నిమజ్జనానికి తరలించనున్నారు. భద్రేశ్వర్‌చౌక్‌లో ఏర్పాటుచేసిన హిందు ఉత్సవ కేంద్ర సమితి వేదిక నుంచి మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఉత్సవ సమితి ప్రతినిధులు స్వాగతం చెప్పనున్నారు. ఇబ్బందులు లేకుండా మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తగిన ఆదేశాలు జారీచేశారు. కోకట్ కాగ్నా నది వద్ద కోకట్ గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నది వద్ద ప్యారికేట్లు లైటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
గణనాథుడికి 56 రకాల నైవేద్యాలు
తాండూరు: విజ్ఞానపురి కాలనీలో ప్రతిష్ఠించిన గణపతి వద్ద ఈ ఏడాది ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. కాలనీకి చెందిన మహిళలు 56 రకాల వంటల చేసి గణనాథుడికి నైవేద్యాలను సమర్పించారు. 21కిలోల డ్రైఫ్రూట్స్‌తో గణపతి లడ్డును తయారు చేశారు. ఇలాంటి లడ్డు తయారు చేయడం తాండూరులో ఇదే మొదటిసారి. ఈసారి 11లడ్డూలను వేలం వేయనున్నారు.
ఘట్‌కేసర్ రూరల్: అంకుషాపూర్ ప్రిన్సిటన్ కళశాలలో నిర్వహిస్తున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థినులు గురువారం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎదులాబాద్ లక్ష్మినారాయణ చెరువులో వినాయకున్ని నిమజ్జనం చేశారు.