చెక్‌పోస్టుల్లో పకడ్బందీ తనిఖీలు: ఎస్పీ
ABN , First Publish Date - 2023-05-02T23:56:03+05:30 IST
వికారాబాద్ జిల్లాలోని సరిహద్దు చెక్‌పోస్టుల్లో పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. కొడంగల్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని రావులపల్లి, కరణ్‌ఖోట్, కోత్లాపూర్, కర్ణాటక పరిధిలోని రిబ్బంపల్లి చెక్‌పోస్టులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.
వికారాబాద్ రూరల్/కొడంగల్ రూరల్/తాండూరు రూరల్, మే 2: వికారాబాద్ జిల్లాలోని సరిహద్దు చెక్‌పోస్టుల్లో పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. కొడంగల్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని రావులపల్లి, కరణ్‌ఖోట్, కోత్లాపూర్, కర్ణాటక పరిధిలోని రిబ్బంపల్లి చెక్‌పోస్టులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కర్ణాటకలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంతో సరిహద్దులు కలిగిన పోలీ్‌సస్టేషన్ల పరిధిలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా డబ్బు, మద్యం రవాణాపై పటిష్ట నిఘా పెట్టినట్లు చెప్పారు. నాకాబంది నిర్వహించి కార్డన్‌సెర్చ్‌లు, వాహనాల తనిఖీ, దాబాలు, హోటళ్ల తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. పాతనేరస్థులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని బైండోవర్ చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎవరైనా తమ వ్యాపారం, ఇతర అవసరాలకు డబ్బులు తీసుకొని వళ్తే రసీదులు తప్పనిసరిగా తమవెంట తీసుకెళ్లాలని సూచించారు. లేదంటే డబ్బులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు కరుణసాగర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శంకర్, రాంబాబు తదితరులు ఉన్నారు. అదేవిధంగా కొడంగల్ మండల పరిధిలోని రావుల్‌పల్లి చెక్‌పోస్టును ఎస్పీ పరిశీలించారు. జిల్లాలో మొత్తం 5 పోలీ్‌సస్టేషన్‌ల పరిధిలో 6 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు పోలీసు అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిగి డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, తాండూర్ డీఎస్పీ శేఖర్‌గౌడ్, కొడంగల్ సీఐ శంకర్, కొడంగల్, కరన్‌కోట్ ఎస్‌ఐలు ఏ.రవిగౌడ్, రాంబాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరు మండలం తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కొత్లాపూర్ చెక్‌పోస్టును ఎస్పీ పరిశీలించారు. పోలీసులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. నాకాబంది నిర్వహించి ఎప్పటికప్పుడు మద్యం సరఫరా, డబ్బులు సరఫరా వంటివి జరుగకుండా సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీవెంట తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్, రూరల్ సీఐ రాంబాబు, ఎస్‌ఐ మధుసూదనరెడ్డి, సిబ్బంది ఉన్నారు.