రెవెన్యూ శాఖలో దరఖాస్తులను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-03-25T23:26:49+05:30 IST

రెవెన్యూశాఖకు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌ నుంచి శనివారం మండలాల తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

రెవెన్యూ శాఖలో దరఖాస్తులను పరిష్కరించాలి

వికారాబాద్‌ రూరల్‌, మార్చి 25: రెవెన్యూశాఖకు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌ నుంచి శనివారం మండలాల తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తహసీల్దార్‌ కార్యాలయంలో పెద్దమొత్తంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, జనన మరణ, కుటుంబసభ్యుల ధ్రువీకరణ పత్రాలతో పాటు సర్వేకు సంబంధించిన దరఖాస్తులు పెద్దఎత్తున పేరుకుపోయాయన్నారు. దరఖాస్తులన్నంటినీ పరిశీలించి పద్ధతి ప్రకారం వారం రోజుల్లో పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉంటే వీఆర్‌ఏల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో తాండూర్‌, పరిగి, మర్పల్లి, ధారూర్‌, కుల్కచర్ల మండలాల్లో అర్హులైన లబ్ధిదారుల నుంచి డబుల్‌బెడ్‌రూమ్‌ దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు దరఖాస్తులను స్వీకరించి వెంటనే విచారణ నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఆర్డీవోలు విజయకుమారి, అశోక్‌కుమార్‌, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:26:49+05:30 IST