కాంగ్రెస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తులు
ABN , First Publish Date - 2023-08-22T23:26:21+05:30 IST
తాండూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మంగళవారం గాంధీభవన్‌లో పలువురు కాంగ్రె్‌సనేతలు దరఖాస్తులు చేశారు.
తాండూరు, ఆగస్టు 22: తాండూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మంగళవారం గాంధీభవన్‌లో పలువురు కాంగ్రె్‌సనేతలు దరఖాస్తులు చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శులు రఘువీరారెడ్డి, ధారాసింగ్, ఎఐసీసీ సభ్యుడు ఎం.రమేష్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ జనార్దన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఉత్తంచంద్ తదితరులు దరఖాస్తులను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌కు అందజేశారు. పార్టీ స్పోక్ పర్సన్ కాల్వ సుజాత బుధవారం పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.