ఆలయాలకు పూర్వవైభవం

ABN , First Publish Date - 2023-06-26T00:17:40+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ఆలయాలకు పూర్వవైభవం సంతరించుకుంటున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అభిప్రాయపడ్డారు.

ఆలయాలకు పూర్వవైభవం
షాద్‌నగర్‌ అర్బన్‌ : ఎమ్మెల్యేను సన్మానిస్తున్న అర్చకులు

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

షాద్‌నగర్‌ అర్బన్‌, జూన్‌ 25: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ఆలయాలకు పూర్వవైభవం సంతరించుకుంటున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అభిప్రాయపడ్డారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని 22 ఆలయాలు దూప, దీప, నైవేద్యం పథకం కింద ఎంపికయ్యాయి. ఈమేరకు ఆలయ పూజారులకు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపిక పత్రాలను ఆయన అందజేశారు. ప్రతీ ఆలయంలో నిత్య దీపారాధన జరగాలని, ప్రజల్లో భక్తిభావం పెరగాలన్న ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న ఆలయాలను సైతం దూప, దీప, నైవేద్యం పథకం కింద ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆలయ పూజారులు నిష్టతో అనునిత్యం పూజలు చేస్తూ, ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచాలని ఎమ్మెల్యే కోరారు. పూజారులు ఎమ్మెల్యేను సన్మానించి, ఆశీర్వదించారు.

ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

కొందుర్గు : ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. దూప, దీప, నైవేద్య పథకంలో భాగంగా కొందుర్గు మండలంలో ఎంపికైన దేవాలయకు సంబంధించి అర్చకులకు ఆదివారం మండల పరిధిలోని విశ్వనాథ్‌పూర్‌లో నియామక పత్రాలను అందజేశారు. రాంచంద్రాపూర్‌, ముట్పుర్‌, రేగడిచిల్కమర్రి, చెర్కుపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయాలు, చుక్కమెట్‌లోని తిరుమలేశ్వర స్వామి ఆలయం ఎంపికయ్యాయి. కాగా, అంతకుముందు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ ఆవిష్కరించారు. అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. విగ్రహ దాత కృష్ణను ఎమ్మెల్యే అభినందించారు. వైస్‌ ఎంపీపీ రాజేష్‌ పటేల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, సర్పంచులు శ్రీధర్‌రెడ్డి, షరీఫాబేగం జహంగీర్‌, నర్సింహరెడ్డి, కృష్ణవేణి, బుచ్బమ్మ, నాయకులు రామకృష్ణ, రాంరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఈవో నరేందర్‌, అర్చకులు గురుప్రసాద్‌, ప్రదీ్‌పకుమార్‌, అశోక్‌శర్మ, భరత్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:17:52+05:30 IST