ఏఎన్‌ఎంలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
ABN , First Publish Date - 2023-08-16T23:58:51+05:30 IST
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఏఎన్‌ఎంలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ మహిపాల్ డిమాండ్ చేశారు.
వికారాబాద్, ఆగస్టు 16: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఏఎన్‌ఎంలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ మహిపాల్ డిమాండ్ చేశారు. వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట బుధవారం ఏఎన్‌ఎంలు రెండవ రోజు నిరవధిక సమ్మె నిర్వహించగా వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 సంవత్సరాల నుంచి వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జీవో విడుదల చేయాలని డిమండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం యూనియన్ జిల్లా కార్యదర్శి లలిత, పాపమ్మ, శోభ, , సుహాసిని, పద్మ, మాణిక్యమ్మ, రోజా, కుమారి, భాగ్యలక్ష్మి, సుకన్య, సంతోష, చంద్రకళ, రజియా, సువర్ణ , స్వరూప, ప్రభావతి, జయలక్ష్మి పాల్గొన్నారు.
తాండూరు: కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తంచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 1520 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ రద్దుచేసి ఖాళీ పోస్టుల్లో కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలను సీనియారిటీ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. జూలై 31వ తేదీన సమ్మెనోటీసు ఇచ్చామని, ఆగస్టు 15 నుంచి సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల జిల్లా ఉపాధ్యక్షురాలు వెంకటమ్మ, తాండూరు డివిజన్ అధ్యక్షురాలు శాంత, కోశాధికారి భారతి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
పరిగి: కాంటాక్టు ఏఏఎన్‌ఎంల సమ్మె బుధవారం రెండవరోజు కొనసాగింది. సీఐటీయూ ఆధ్వర్యంలో పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ.. ఏఎన్‌ఎంలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 180మంది ఏఏఎన్‌ఎంలు పనిచేస్తున్నట్లు తెలిపారు. కాంటాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు పేస్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రజీయా, గౌరీ, చంద్రకళ, పుష్ప, వర్ణలత, సలీమా, జంగమ్మ, శ్రీలత, జ్యోతి పాల్గొన్నారు.