Share News

చేవెళ్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:29 PM

గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చేవెళ్ల మండల కేంద్రంలోని రైతుబజార్‌ వద్ద చోటు చేసుకుంది. పోలీ్‌సలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

చేవెళ్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

చేవెళ్ల, డిసెంబరు 18 : గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చేవెళ్ల మండల కేంద్రంలోని రైతుబజార్‌ వద్ద చోటు చేసుకుంది. పోలీ్‌సలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి చేవెళ్ల మండల కేంద్రంలోని పోలీస్‌ క్వార్టర్స్‌ పక్కన ఉన్న రైతుబజార్‌ వద్ద సోమవారం శవమై కన్పించడంతో స్థానికులు గమనించి చేవెళ్ల పోలీ్‌సలకు సమాచారం అందించారు. ఈ మేరకు మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా, చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వారు చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీ్‌సలు సూచించారు.

Updated Date - Dec 18 , 2023 | 11:29 PM